హర్యానా గణతంత్ర వేడుకల్లో.. అనూహ్య ఘటన
రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కర్నల్ నగరంలోని మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు.. సీఎం ఖట్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కొందరు చిన్నారులు రాముడు సీత, లక్ష్మణుడిగా వేషాలు ధరించి ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన అనంతరం సీఎం ఖట్టర్ నేరుగా ఆ చిన్నారుల వద్దకు వెళ్లి రాముడి వేషధారణలలో ఉన్న చిన్నారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.













