ప్రధాని మోదీ హయాంలో …మరో చరిత్రాత్మక ఘట్టం
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మరో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. చీతా ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. సుమారు 74 ఏళ్ల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. మొత్తం ఎనిమిది చీతాలను ప్రత్యేక పరిస్థితుల నడమ భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని నమీబియా పరిస్థితులకు దగ్గరగా ఉండే షియోపూర్ ప్రాంతంలో కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు.













