ఓయో బంపరాఫర్.. విద్యార్థులకు మాత్రమే
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022 ను 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్‌పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ, గ్రామాల విద్యార్థినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది.కొన్ని సార్లు నిమిషాల వ్యధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్థినులకు ఓయో రూమ్స్ అందిస్తుంది. అందులో వైఫై, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జ్యూమర్) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.






