త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి
తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయల తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేసిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా, బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్‌గా ఉన్నారు.













