ఆస్ట్రేలియా పార్లమెంటు ముందు తెలుగు విద్యార్థుల ప్రదర్శన
అమరావతి రాజధాని రైతులకు ఆస్ట్రేలియాలోని తెలుగు విద్యార్థులు మద్దతు ప్రకటించారు. కాన్బెర్రాలోని పార్లమెంటు భవనం ముందు జై అమరావతి ప్లకార్డులను ప్రదర్శించారు. గత ప్రభుత్వం రాజధాని విషయంలో ముందుచూపుతో వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలను స్ఫూర్తిగా తీసుకోకుండా, ఆఫ్రికా దేశాల స్ఫూరితో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుందన్నారు. ఆస్ట్రేలియాలోని అన్ని ప్రాంతాలకూ సమదూరంలో ఉన్న కాన్బెర్రాను రాజధానిగా నిర్ణయించి, అభివృద్ధి చేశారని వివరించారు. 250 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు.













