కునో లో మరో చీతా.. ఇది పదో ఘటన
మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కు లో మరో చీతా చనిపోయింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మృతి చెందినట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ ఉదయం చీతా తూలుతూ నడవడాన్ని ట్రాకింగ్ బృందం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బలహీనంగా ఉండటంతో వెంటనే దానికి చికిత్స అందించారు. ఆ తర్వాత అది కాస్త కోలుకున్నట్లే కన్పించినా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పోస్ట్మార్టం తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందన్నారు. కాగా ఇప్పటివరకు కునో నేషనల్ పార్క్లో చీతా మరణించడం ఇది పదో ఘటన కావడం గమనార్హం.













