AI చేస్తున్న ఈ ఒక్క తప్పే… దాన్ని పట్టిస్తోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
Facebookలో ఒక కొత్త Friend Request వచ్చింది.
Instagramలో ఒక అందమైన Profile కనిపించింది.
WhatsAppలో ఒక ఆకర్షణీయమైన DP మెరిసింది.
ఒక్క క్షణంలో…
మీ మెదడు ఒక నిర్ణయం తీసుకుంటుంది.
“అవతల ఉన్నది నిజమైన మనిషే.” అని…ముందుకు ప్రొసీడ్ అయ్యిపోతాం. క్షణాల్లో నిర్ణయం తీసుకుంటాం.
కానీ… ఓ నమ్మలేని నిజం ఏమిటంటే… ఆ నిర్ణయం మీది కాదు. దాన్ని AI మానుప్యులేట్ చేస్తోంది.
అదెలా అంటారా…మన మెదడు ఎలా,ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో AI ఇప్పటికే నేర్చుకుంది. అందుకే… ఇప్పుడు AI మన కళ్లను కాదు… మన నమ్మకాన్నే టార్గెట్ చేస్తోంది. ఇదే ఈ డిజిటల్ యుగంలో నిజం. అయితే ఇక్కడ మనం అర్దం చేసుకుని జాగ్రత్త పడాల్సింది మరొకటి ఉంది.
AI ఎంత తెలివిగా మారిందనేది కాదు. మన మెదడు ఎంత సులభంగా ఎలా నమ్మేస్తోంది అన్నదే.
ఒక ముఖం…
రెండు కళ్లు…
ఒక చిరునవ్వు…
కొంచెం అందం…
అంతే.
వీటిని చూసి “అవతల ఉన్నది మనిషే” అని మన మెదడు ఎలా తీర్పు చెప్పేస్తోంది అనే. మన ఈ బలహీనతమీదే AI ఎలా గెలుస్తోంది అనే. ఇక్కడ చిన్న లాజిక్ …
మీ కళ్లను నమ్ముతారా?
చాలా మంది వెంటనే “అవును” అంటారు.
మరి…
మీ మెదడును?
ఒక్క సెకను ఆగుతారు…
ఎందుకంటే…
కళ్లు చూసేది ఒకటి… మెదడు నమ్మేది ఇంకొకటి!
ఈ రెండింటి మధ్య జరిగే కన్ఫ్యూజన్ డ్రామాలోనే AI గెలుస్తోంది.
అవతల ఉన్నది “ఇది నిజమైన మనిషే.” అనే ఆ నిర్ణయం ఎలా పుడుతుందో AI ఇప్పటికే నేర్చుకుంది.
అందుకే… అది ఇప్పుడు ముఖాలను కాదు… మన నమ్మకాన్నే డిజైన్ చేయగలుగుతోంది.
ఒకప్పుడు AIని పట్టుకోవడం చాలా సులభం. వంకర చెవి. అదనపు వేలు. వింత కళ్లూ. తప్పుడు వరస పళ్లు. అవి చూసి… “ఇది AI” అని చెప్పేసేవాళ్లం. అప్పుడు… AI మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించేది. కానీ… తన తప్పులే దాన్ని పట్టించేవి. ఇప్పుడు… ఆ తప్పులన్నీ దాదాపు మాయమయ్యాయి.
ఇప్పుడు AIని కాదు…మన కళ్లనే హ్యాక్ చేస్తున్నారు. ఇది ఫోటోల కథ కాదు. ఇది మన మెదడు కథ. మన మెదడుకు ఒక బలహీనత ఉంది. సమతుల్యంగా కనిపిస్తే… అందంగా కనిపిస్తే… పరిచయమైన మనిషిలా అనిపిస్తే… అది నిజమేనని నమ్మేస్తుంది. అది లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో మనలో ఏర్పడిన సహజ స్వభావం. AI ఇప్పుడు అదే స్వభావాన్ని ఉపయోగిస్తోంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి తేల్చి చెప్పారు.
ఆ అధ్యయనం…AIలో తప్పులు వెతకడం కాదు… AI ఎందుకు నిజమైనట్టుగా అనిపిస్తుందో అర్థం చేసుకుంటే? అనే పాయింట్ దగ్గరే వారికి సమాధానం దొరికింది.
AI ఒక మనిషి ముఖాన్ని కాపీ చేయదు. లక్షలాది ఫోటోలను చూసి… వాటిలోని సాధారణ లక్షణాలను నేర్చుకుంటుంది. ఆ తర్వాత… వాటన్నింటి సగటుతో ఒక కొత్త ముఖాన్ని సృష్టిస్తుంది. అందుకే… ఆ ముఖం ఎవరిదీ కాదు. అయినా… అందరిదీ అనిపిస్తుంది. అక్కడే అసలు మాయ దాగి ఉంది.
ఇవి కూడా చదవండి
కానీ…
ప్రతి నేరస్థుడు…
ఎంత తెలివిగా ప్లాన్ చేసినా…
ఒక చిన్న ఆధారం వదిలిపెడతాడు.
AI కూడా అలాగే.
విచిత్రంగా…
అది చేసే తప్పు…
మరీ తెలివిగా ఉండటం కాదు.
మరీ పర్ఫెక్ట్గా ఉండటం.
పరిశోధకులు AI ముఖాల్లో తరచుగా కనిపించే లక్షణాలను గుర్తించారు. అవేంటో చూద్దాం
ఈ చిన్న అనాలజీతో అర్థం చేసుకోండి:
ఎగ్జామ్ టాపర్: ఎగ్జామ్లో 100కి 100 మార్కులు తెచ్చే పిల్లలు చాలా అరుదుగా ఉంటారు. అలాగే, నిజమైన మనుషుల ముఖాల్లో కూడా చిన్న చిన్న అసమానతలు చాలా సహజం. కానీ AI మాత్రం అందరినీ వందకు వంద మార్కులు వచ్చే ‘టాపర్’ లా తయారు చేస్తోంది.
కొత్త నోటు: మార్కెట్లోకి వచ్చిన కొత్త నోటు లాగా మరీ పర్ఫెక్ట్గా, నిగనిగలాడుతూ ఉంటే… అది నకిలీ (ఫేక్) అయ్యే అవకాశం ఎక్కువ. మనుషుల ముఖాల విషయంలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి!
AI ముఖాల్లో ఉండే ఆ 6 సైన్స్ (Signs) ఇవే:
సోషల్ మీడియాలో ఏదైనా ప్రొఫైల్ చూసినప్పుడు ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే… ఒక్కసారి అనుమానించండి:
మరీ Symmetry: ముఖం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ అద్దంలో చూసినట్టు పర్ఫెక్ట్గా ఒకేలా ఉంటాయి.
మరీ Attractive: మనుషుల కంటే మితిమీరిన అందంతో, గ్లోతో మెరిసిపోతుంటాయి.
మరీ Balanced: కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఖచ్చితమైన కొలతలతో అమర్చినట్లు ఉంటాయి.
Expressions తక్కువ: కళ్లల్లో జీవం, ముఖంలో సహజమైన హావభావాలు పెద్దగా కనిపించవు.
ప్రత్యేకత ఉండదు: ఎలాంటి ప్రత్యేకమైన మచ్చలు, ముడతలు లేని ఒక క్లోనింగ్ మొహంలా ఉంటుంది.
చూసిన వెంటనే గుర్తుండవు: ఇవి ఎంత అందంగా ఉన్నా, బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వవు. చూసిన కాసేపటికే మర్చిపోతాం.
డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ముప్పు: ‘ది మ్యాన్ హూ నెవర్ ఎగ్జిస్టెడ్’
ఈ AI ఫోటోల వెనుక పెద్ద పెద్ద స్కామ్స్ దాగున్నాయి. మన జీవితాలకు ఇవి చాలా దగ్గరగా వచ్చేసాయి:
Romance Scam: మాయచేసే AI ఫోటోలను ఉపయోగించి Fake Girlfriendsగా మారి, పెళ్లి పేరుతో మ్యారేజ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి లక్షల్లో లాగేస్తున్నారు (Honey Trap).
Job Scam: లింక్డ్ఇన్లో ఎవరో పెద్ద కంపెనీ HR అంటూ AI ఫోటోతో ప్రొఫైల్ పెట్టి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేస్తున్నారు.
Investment Scam: Fake CEOలు, Fake Businessmen ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేయిస్తున్నారు.
Fake Influencers: Instagramలో లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, రీల్స్ చేస్తుంటారు… కానీ తెర వెనుక అసలు ఆ మనిషే ఉండడు!
ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్:
Zoom, Tinder… ఇలాంటి కొన్ని పాపులర్ యాప్స్ ఇప్పుడు కేవలం ప్రొఫైల్ ఫోటోను చూసి నిజమో కాదో చెప్పలేకపోతున్నాయి. అందుకే, అవతలి వైపు ఉన్నది నిజమైన వ్యక్తినే అని నిర్ధారించడానికి ‘Face Verification’, ‘Biometric Checks’ (రెటినల్ స్కాన్స్ వంటివి) తప్పనిసరి చేస్తున్నాయి.
దాంతో ఇప్పుడు జనం ఆలోచన మారిపోతోంది. ఏదైనా ఫొటో లేదా వీడియో చూడగానే.. ” బాగుందా?” కాదు.
“ఈ మనిషి నిజంగా ఉన్నాడా?” అని ఆగి ఆలోచిస్తున్నారు.
ఏదైమైనా
AI రోజురోజుకీ మారుతోంది. రేపు ఈరోజు కనిపించే క్లూలు కూడా మారిపోవచ్చు. కానీ… ఒక విషయం మాత్రం మారదు. మనుషులను ప్రత్యేకంగా నిలబెట్టేది వారి అందం కాదు.
వారి చిన్న చిన్న అసంపూర్ణతలు. ఒక చిన్న మచ్చ… చిరునవ్వు… ఒక కనుబొమ్మ మరోదానికంటే కొద్దిగా ఎత్తుగా ఉండటం… ఇలాంటివే మనల్ని నిజమైన మనుషులుగా గుర్తుపడేలా చేస్తాయి. AI వాటిని అనుకరించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.
అయినా..
AI చేస్తున్న ఈ ఒక్క తప్పే… దాన్ని పట్టిస్తోంది.
పరిపూర్ణంగా కనిపించడం అనేది ఎప్పటికీ ప్రకృతి పని కాదు.
అది … అల్గోరిథమ్ పని.
ప్రకృతి ని ఫాలో అయితే అల్గోరిథమ్ మనని బోల్తా కొట్టించలేదు.








