జీ-20 సదస్సుకు జిన్‌పింగ్ ?
ఇండోనేసియాలోని బాలిలో వచ్చే నెల జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్టీ ముఖ్యులు, విదేశాంగ శాఖ అధికారులు జీపింగ్లో మీడియా సమావేశంలో నర్మగర్భంగా పేర్కొన్నారు. జిన్‌పింగ్ పదేళ్ళ పాలనలో చైనా తన సార్వభౌమత్వాన్ని, భద్రతను నిలబెట్టుకుందని, దౌత్యపరమైన విజయాన్ని సాధించిందని వారు తెలిపారు. ఇండోనేసియాకు, బాలి సదస్సుకు తమ సహకారం ఉంటుందన్నారు. సదస్సులో పాల్గొనే విషయాన్ని తర్వాత వెల్లడిస్తామన్నారు. ఒకవేళ జిన్‌పింగ్ హాజరైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మొదటిసారి ముఖాముఖి సమావేశమయ్యే అవకాశముంది.













