అందుకే ఈ కొత్త చట్టం తెస్తున్నాం!
దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులను అడ్డుకునేందుకు కఠిన చట్టం తేవాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ ఛానల్ ద్వారా చిన్న బోట్లలో వచ్చే వారిని అడ్డుకునేందుకు ఈ చట్టం తోడ్పడగలదని ఆయన భావిస్తున్నారు. వచ్చే వారం ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. నా ఐదు ప్రాధాన్యాంశాల్లో అక్రమ వలసలను అరికట్టడం ఒకటి. చట్టపరంగా దేశంలకోకి ప్రవేశించే వారితో పాటు స్థానికులకు ఇలా ఆక్రమంగా వలసవచ్చే గ్యాంగులవల్ల ప్రమాదం పొంది ఉంది. అందుకే ఈ బోట్లను అడ్డుకునేందుకు కొత్త చట్టం తెస్తున్నాం అని ఆయన వివరించారు.













