ఏపీఎన్ఆర్టి కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టి) అమెరికా రీజినల్ కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధప్రదేశ్ ఐటి అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాకు అమెరికాలోని తెలుగు వారికి ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.













