అమెరికాలో చిక్కిన మరో కీలక నిందితుడు
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మరో కీలక నిందితుడిని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. సిద్ధూ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ధర్మ్‌జోత్ సింగ్ అనే వ్యక్తి ఆయుధాలు సరఫరా చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. ఈ హత్య కేసులో మరో కీలక నిందితుడు సచిన్ బిష్ణోయ్‌ను విచారించగా ధర్మ్‌జోత్ వివరాలు బయటకొచ్చాయి. అతడు అమెరికాలో తలదాచుకున్నాడని తెలుసుకున్న పోలీసులు ఆపరేషన్‌కు ప్రణాళికను వేశారు. పంజాబ్, ఢల్లీి పోలీసు శాఖలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఏఎన్ఐ) సమష్టిగా నిందితుడిని పట్టుకునేందుకు పని చేశాయి. ఈ క్రమంలో కాలిఫోర్నియాలో కహ్లోన్ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో నిందితుడిని భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.













