Aqua Titan: సముద్రంలో రష్యా నౌక యూటర్న్.. చైనాకు కాదని.. భారత్ దిశగా!
Russian Oil: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన రంగంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్ ‘ఆక్వా టైటాన్’ (Aqua Titan) తన దిశను మార్చుకుని భారత్ వైపు వస్తోంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, దక్షిణ చైనా సముద్రంలో యూటర్న్ తీసుకున్న ఈ భారీ నౌక, మార్చి 21న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది.
అనూహ్య మలుపు: ఈ ఏడాది జనవరిలో బాల్టిక్ సీ పోర్ట్‌లో చమురు లోడ్ చేసుకున్న ఈ ట్యాంకర్, వాస్తవానికి చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే రష్యా నుంచి భారత్ దిగుమతులు పెంచుతున్న నేపథ్యంలో ఇది మన దేశం వైపు మళ్లింది.
ఇవి కూడా చదవండి
పెరిగిన దిగుమతులు: రష్యా చమురుపై ఉన్న కొన్ని ఆంక్షలను అమెరికా సడలించిన నేపథ్యంలో, భారత రిఫైనరీలు తమ కొనుగోళ్లను వేగవంతం చేశాయి. ఇప్పటివరకు భారత్ సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును సేకరించినట్లు సమాచారం.
హర్మూజ్ జలసంధిలో ‘డార్క్ మోడ్’ ప్రయాణాలు: ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం సవాలుగా మారింది. సుమారు 90 నౌకలు తమ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను నిలిపివేసి (Dark Mode), అంతర్జాతీయ ఆంక్షలను దాటుకుంటూ ఈ జలసంధిని దాటినట్లు మారిటైమ్ డేటా వెల్లడించింది.
ధరల పెరుగుదల ముప్పు: భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా రష్యా నుంచి దిగుమతులను పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి








