చివరి రౌండ్ లోనూ రిషి సునక్ విజయం
బ్రిటన్ ప్రధాని పీఠానికి భారత సంతతికి చెందిన వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ మరొక్క అడుగు దూరంలో ఉన్నారు. అధికార కంజర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యేందుకు జరిగిన ఐదో రౌండ్లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రిషి సునక్‌కు 137 మంది కంజర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓటేయగా, సమీప పోటీదారు విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు 113 ఓట్లు వచ్చాయి. ఇక 105 ఓట్లు మాత్రమే పొందిన వాణిజ్య శాఖ మంత్రి పెనీన మోర్డాంట్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో కంజర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికవడం తద్వారా ప్రధాని పీఠంపై కూర్చొనేందుకు రిషి సునక్‌తో పాటు లిజ్ ట్రస్ మాత్రమే బరిలో ఉన్నారు. మొదటి నుంచి చివర రౌండ్ వరకు రిషి సునక్ పోటీలో అగ్రస్థానంలో నిలువడం గమనార్హం.













