నా కుమార్తె వల్లే రిషి సునాక్ ప్రధాని అయ్యారు : సుధామూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
రచయిత్రి, విద్యావేత్త, వితరణశీలిగా సుపరిచితులైన సుధామూర్తి తన కుమార్తె అక్షతా మూర్తి, బ్రిటన్ ప్రధాని, అల్లుడు రిషిసునాక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భర్త విజయంలో భార్య కీలక పాత్ర పోషిస్తుందని, తన కుమార్తె వల్లే రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భార్య మహిమ భర్తను ఎలా మార్చగలదో చూడండి, నేను నా భర్తను వ్యాపారవేత్తగా మార్చాను. నా కుమార్తె తన భర్తను బ్రిటన్ ప్రధానమంత్రిని చేసింది అని పేర్కొన్నారు. సుధామూర్తి ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి సతీమణి, వారి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునాక్ 2009లో వివాహం చేసుకున్నారు.













