వలస కార్మికులకు ఉచిత వీసాలు
వలస కార్మికులకు ఉచితంగా వీసాలు అందించేందుకు ఖతర్‌లోని ఒక క్యాటరింగ్ కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలోని ఒక లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వీసా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఖతర్‌లోని వివిధ కంపెనీలు విమానయాన రంగానికి ఆహార సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ వలస కార్మికులతో ఖాళీలను భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. కిచెన్ క్లీనింగ్, వెయిటర్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల కోసం ఈ నెల 30న ఆర్మూర్‌లో, 31న సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖతర్‌లో వేతనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనుంది. కార్మికులకు ఉచిత వీసాలు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సతీశ్‌రావు తెలిపారు.













