సెప్టెంబర్ 9న ఇంటెల్ ప్లాంటకు శంకుస్థాపన
ఒహియో వద్ద 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.60 లక్షల కోట్ల) పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లకు సెప్టెంబరు 9న ఇంటెల్ కార్ప్ శంకుస్థాపన చేయనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారని కంపెనీ, శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. ఫ్యాబ్స్గా వ్యవహరించే ఈ రండు ప్లాంట్లు 2025లో కార్యకలాపాలను ప్రారంభిస్తాయి. 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఉద్యోగి సగటు వేతనం సుమారు 1,35,000 డాలర్లుగా ఉండొచ్చు. ఈ ప్లాంట్ల నిర్మాణానికి 7,000 మంది కార్మికులు అవసరం అవుతారని అంచనా. పదేళ్ల కాలంలో అదనంగా ఆరు ఫ్యాబ్స్కు 100 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి అవసరం పడొచ్చని ఇంటెల్ సీఈవో ప్యాట్రిక్స్ గెల్సింగర్ తెలిపారు. ఒహియోలో ఇదే అతి పెద్ద ప్రైవేట్ రంగ ప్రాజెక్టుగా ఆయన పేర్కొన్నారు.













