ప్రవాసుల విజయాలు మాకు గర్వకారణం : మోదీ
ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బాలిలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ.. మోదీ భారత్ మాతాకీ జై నినాదాలతో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి మోదీ డ్రమ్స్ వాయించారు. అనంతరం ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడారు. 2014కు ముందు, 2014 తర్వాత భారత్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు. 21వ శతాబ్ధంలో భారతదేశం ప్రపంచానికి ఆశాకిరణమని అన్నారు. డిజిటల్ లావాదేవీలు, గ్లోబల్ ఫిన్‌టెక్, ఐటీ ఔట్ సోర్సింగ్, స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం, వ్యాక్సిన్ తయారీలో భారత దేశం నవంబర్ 1గా నిలిచిందన్నారు. ప్రవాసుల విజయాలు మాకు గర్వకారణం. భారతదేశం` ఇండోనేషియా భాగస్వామ్య వారసత్వం, సంస్కృతితో అనుసంధానించబడి ఉన్నాయి. నేను బాలిలో మీతో మాట్లాడుతున్న వేళ, ఇక్కడికి 1500 కి. మీ దూరంలో భారతదేశంలోని కటక్‌లో బలి యాత్ర మహోత్సవం జరుగుతోంది. ఈ మహోత్సవం వేల సంవత్సరాల నాటి భారతదేశం` ఇండోనేషియా వాణిజ్య సంబంధాలకు ప్రతీక అని మోదీ అన్నారు.













