రష్యా, ఉక్రెయిన్ మధ్య…ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న అమెరికా
రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి నెల రోజులు కావస్తుండగా, ఈ ఉద్రిక్తతలను మరింత ఆజ్యం పోసేలా నాటో దళాలను అమెరికా, దాని మిత్ర పక్షాలు భారీగా పెంచాయి. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మీడియాతో మాట్లాడుతూ స్లొవేకియా, హంగరీ, బల్గేరియా, రుమేనియాలకు నాలుగు కొత్త యుద్ద బృందాలను పంపుతున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో సదస్సు కోసం యూరప్ వెళ్లేందుకు వైట్‌హౌస్ నుంచి బయలుదేరారు. ఉక్రెయిన్ సైనికులు దేశంలోని కొన్ని ప్రాంతాలలో భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నారని పెంటగాన్ తెలిపింది. రాజధాని కీవ్‌కు పశ్చిమాన ఉన్న మకారివ్ శివారులో ఉక్రెయిన్ జెండా మళ్లీ ఎగురువేసినట్లు తెలిసింది. మారియుపోల్‌పై రష్యా దాడులు కొనసాగాయి. దాదాపు లక్ష మంది అక్కడ చిక్కుఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు.













