45 రోజులే పదవిలో ఉన్నా.. ఏడాదికి రూ. కోటి భత్యం
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేవలం 45 రోజులు మాత్రమే ప్రధానిగా పనిచేసినా ఆమెకు జీవితాంత ఏడాదికి రూ. కోటి భత్యం (1,15,000 పౌండ్లు) అందనుంది. అది కూడా పన్ను చెల్లింపుదారుల నుంచే అందడం గమనార్హం. యూకే ప్రధానమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసినప్పటికీ ఆమె పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్ (పీడీసీఏ)కి అర్హులు. ప్రజాజీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు సహాయం చేసేందుకుగానూ ఈ భత్యాన్ని 1991 నుంచి ఇస్తున్నారు. క్యాబినెట్ ఆఫీస్ ఓట్ నుంచి ఈ భత్యాన్ని చెల్లిస్తారు. దీన్ని క్యాబినెట్ ఆఫీస్ ఫైనాన్స్ టీం పర్యవేక్షిస్తుంది.













