భారతీయులకు కువైట్ షాక్..
భారతీయ పర్యాటకులకు కువైట్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. టూరిస్టు వీసాల జారీకి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో కువైట్ దేశానికి వచ్చేందుకు ఇటీవల 53 దేశాలకు చెందిన పౌరులకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో సభ్యత్వం ఉన్న దేశాల్లో గత ఆర్నెళ్లుగా నివసిస్తున్న విదేశీ ప్రొఫెషనల్స్‌కి టూరిస్టు వీసాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో ఇ వీసాలు వీటిని జారీ చేయనుంది. అయిటే టూరిస్టు వీసాలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను మినహాయించింది.
కువైట్‌లో వలస కార్మికులతో పాటు పెద్ద ఎత్తున్న ప్రొఫెషనల్స్ అక్కడ పని చేస్తున్నారు. అయినప్పటికీ భారత్‌కు వీసాలు జారీ చేసే విషయంలో కువైట్ భారత్‌ని పక్కన పెట్టింది. కువైట్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం 53 దేశాలకు చెందిన వారికి ఈ వీసాలు జారీ చేసేందుకు అంగీకారం తెలపగా ఇందులో మెజారిటీ దేశాలు యూరప్, అమెరికా ఖండాలకు చెందినవే ఉన్నాయి. ఏషియాకు సంబంధించి జీసీసీ సభ్యదేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్లలో ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉండాలనే నిబంధన విధించింది.













