వలస కార్మికులకు కువైట్ షాక్.. 60 ఏళ్ల పైబడిన వారిని
విదేశీ వలస కార్మికుల విషయంలో కువైట్ ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ పట్టా లేదని 60 ఏళ్ల వయసు నిండిన విదేశీ వలస కార్మికుల వీసాల రెన్యూవల్‌కు సానుకూలత తెలిపిన కువైట్ ప్రభుత్వం అంతలోనే మనసు మార్చుకుంది. తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికులలో 60 ఏళ్ల వయసు నిండినవారికి డిగ్రీ పట్టా లేకుంటే వారిని సొంత గడ్డకు పంపించాలని 2020 డిసెంబర్లో కువైట్ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తే తమ దేశంలోని వివిధ కంపెనీలలో ఉన్న ఎంతో మంది నిపుణులను కోల్పోవలసి వస్తుందని భావించిన కువైట్ సడలింపులు ఇచ్చింది. దీని ప్రకారం 250 దినార్లు అంటే మన కరెన్సీలో రూ.60 వేల వరకు ఫీజును చెల్లించి 60 ఏళ్ల పైబడిన వలస కార్మికులు వీసా రెన్యూవల్ చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కేటగిరిలోని కార్మికులకు కాస్త ఊరట చెందారు. 1.75 లక్షల మంది వరకు తెలంగాణకు చెందిన వలస కార్మికులు ఉంటారని అంచనా. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు వీసాలను రెన్యూవల్ చేయకపోవడంతో వీసా గడువు ముగిసిన వారు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. దీనిపై సృష్టత రావాల్సి ఉంది.













