భారత్‌కు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ( యూఎన్ఎస్సీ)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా శాశ్వత సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారని వైట్‌హౌస్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో దీనిపై మరింత కసరత్తు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ ఉండాలనేది చారిత్రక ఆలోచన. దీనికి మా మద్దతు ఉంటుంది అని ఆ అధికారి తెలిపారు. అంతకు ముందు ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన జో బైడెన్ భద్రత మండలిని సంస్కరించే అంశంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కౌన్సిల్ లో శాశ్వత సభ్యల సంఖ్యను పెంచేందుకు అమెరికా మద్దతునిస్తుందని తెలిపారు.













