మనకు గొడవలొద్దు.. కలిసి పనిచేద్దాం : బైడెన్
ఇండొనేషియాలోని బాలీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. అధ్యక్షుడిగా జిన్ పింగ్‌తో బైడెన్‌కు ఇదే తొలి ముఖాముఖి. తైవాన్ తదితర అంశాల్ల ఇటీవల ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జీ 20 సదస్సు కోసం వచ్చిన నేతలిరువురూ పలు అంశాలపై దాదాపు 3 గంటల పాటు అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు పరస్పరం అభివాదం చేసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ చేతులు కలిపారు. భేదాభిప్రాయాలు తొలగించుకునేందుకు కలిసి పనిచేద్దామని బైడెన్ అన్నారు.













