మరోసారి నోరుజారిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల కాలంలో తరచూ మాటలపై నియంత్రణ కోల్పోయి గందరగోళ పరిస్థితులను సృష్టించడం సాధారణమైపోయింది. తాజాగా ఐర్లాండ్ పర్యటనలో తొలిరోజే ఇటువంటి ఘటన చోటు చేసుకొంది. ఐర్లాండ్‌లోని డుండల్క్ విండోసోర్ బార్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక కజిన్ అయిన అంతర్జాతీయ రగ్బీ ఆటగాడు రాబ్ కియార్నె ప్రస్తావన తెచ్చారు. అతడు భీకరమైన ఆటగాడు. బ్లాక్ అండ్ టాన్స్ను ఓడించాడు అని పేర్కొన్నారు. ఈ మాటలతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత బైడెన్ ఆ మాటను సవరించుకొన్నారు.













