మోదీకి జో బైడెన్ ఆహ్వానం
ఈ వేసవిలో అమెరికాకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. బైడెన్ ఆహ్వానాన్ని మోదీ స్వీకరించారు. రెండు వర్గాలకు అనువైన సమయం విషయంలో ఇరు దేశాల అధికారులు ప్రస్తుతం ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ఏడాది జూన్, జూలైలలో ప్రధాని అమెరికా పర్యటన ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ జరగనున్నాయి పర్యనకు కనీసం రెండు రోజుల వ్యవధి ఉండేలా అధికారులు చూస్తున్నారు. పర్యటనలో శ్వేతసౌధంలో బైడెన్‌తో కలిసి భోజనంతో పాటు అమెరికా చట్టసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించాల్సి ఉంటుంది అని అధికార వర్గాలు వెల్లడించాయి.













