జీ20 సదస్సులో … ఆసక్తికర సన్నివేశం
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరదాగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా ఇండోనేషియాలోని బాలిల్ జీ20 సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్‌తో సహా 20 దేశాల, యూరోపియన్ యూనియన్లకు చెందిన అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీ 20 సదస్సులో పాల్గొనడంతో పాటు కీలక నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశానికి భారత్ ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసింది.













