భారత్-అమెరికా సంబంధాలపై బైడెన్‌తో చర్చలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాలిలో భేటీ అయ్యారు. కృత్రిమ మేధ, సంక్లిష్ట సాంకేతికతలు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సహా పలు కీలక రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షించారు. ఉక్రెయిన్ సంక్షోభం, దాని ప్రభావాలపై కూడా చర్చించారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, బైడెన్ తమ సమావేశంలో సమాలోచనలు జరిపారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్నందుకు గాను బైడెన్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. భారత్ జి-20 అధ్యక్ష పీఠమెక్కాక ఇరు దేశాలు సన్నిహిత సమస్యయంతో ముందుకు సాగుతాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.













