ఇది యుద్ధాల శకం కాదు
ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా సభ్య దేశాలు బాలి డిక్లరేషన్ ప్రకటించాయి ఇది యుద్ధాల శకం కాదని తీర్మానం పేర్కొన్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై సభ్యదేశాలు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని అంగీకరించిన తీర్మానం.. ఇదే సమయంలో ఘర్షణల్లో చిక్కుకొన్న పౌరులకు రక్షణ ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. కాగా సదస్సు సంధర్భంగా 2023 ఏడాదికి సంబంధించి జీ20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భారత ప్రధాని మోదీకి అప్పగించారు.













