ఇక గ్రీన్‌కార్డు పొందటం తేలికే
అమెరికాలో విదేశీయుల శాశ్వత నివాసం కోసం అవసరమైన గ్రీన్‌కార్డు పొందటం ఇక తేలిక కానున్నది. డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెచ్చిన ఓ నిబంధనను ప్రస్తుత అధ్యక్షుడు పక్కనబెట్టారు. అమెరికాలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న విదేశీయులు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పలు ప్రభుత్వ ప్రయోజనాలు వాడుకొని ఉంటే, వారి గ్రీన్‌కార్డు దరఖాస్తులకు ప్రాధన్యమిచ్చేవారు. ట్రంప్ హయాంలో ఈ నిబంధనను రద్దు చేయటంతో గ్రీన్‌కార్డులు పొందటం కష్టమైంది. ట్రంప్ విధించిన నిషేధాన్ని తొలగించినట్టు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.













