అమెరికాను చుట్టేస్తున్న వరుస టోర్నడోలు
అమెరికాలోని దక్షిణ, మద్య ప్రాచ్య రాష్ట్రాలపై టోర్నడోల విధ్వంసం కొనసాగుతోంది. డజనుకు పైగా టోర్నడోలు సృష్టించిన ఈ విపత్తుకు ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్రాల్లో కనీసం 26 మంది మరణించారని అధికారులు తెలిపారు. అర్కన్సాస్ ఇల్లినాయ్, ఇండియానా, అలబామా, మిసిసిపీ, టెనెసీ రాష్ట్రాల్లో నివాసాలు, కార్యాలయ భవనాలు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. భీకర గాలులు భారీ వృక్షాలను సైతం పెకలించేవేశాయి. గాల్లోకి లేచిన ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ పడడంతో చాలా ప్రాంతాలు చెత్తతో నిండిపోయాయి. టోర్నడో దెబ్బకు అర్కన్సాస్ లో ఓ హైస్కూల్ భవనం కూలిపోయింది.













