TCA ఆధ్వర్యంలో వన భోజనాల కార్యక్రమం
అమెరికాలోని హ్యూస్టన్ లోని ప్రవాసాంధ్రుల కోసం హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) మరో అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తెస్తోంది. హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఏర్పాట్లు అయ్యి, 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యేడాది స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 25 న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘‘గోల్డెన్ జూబ్లీ TCA పిక్నిక్ (వన భోజనాలు) ను ఏర్పాటు చేశారు.
ఈ పిక్నిక్ లో అన్ని వయస్సుల వారూ పాల్గొనవచ్చని నిర్వాహకులు ప్రకటించారు. అక్టోబర్ 25 వ తేదీన జరిగే ఈ కార్యక్రమం కిట్టి హోలో పార్క్ (Kitty Hollow Park), పెవిలియన్ E & F, 9555 HWY. 6 S, మిస్సౌరీ సిటీ, TX 77459 వేదికగా జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకూ ఈ పిక్నిక్ వుంటుంది.
ఈ సందర్భంగా కుటుంబీకులు, అక్కడికి వచ్చే వారితో కలిసి ఆస్వాదించడానికి మంచి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. MANA DJ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉచితంగా స్నాక్స్, అందరికీ రుచికరమైన మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు.
అయితే 10 సంవత్సరాల లోపు వున్న వారికి ఉచిత ప్రవేశం వుంటుంది. నాన్ టీసీఏ సభ్యులకు రుసుము 5 డాలర్లుగా నిర్ణయించారు.ఈ వేడుకకు ఆహ్వానితులు తప్పనిసరిగా ముందస్తు రిజిస్ట్రేషన్ (Invitation only) చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ (QR Code) లేదా ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రవాస తెలుగువారందరూ ఈ మహా వేడుకలో కుటుంబ సమేతంగా పాలుపంచుకుని, స్వర్ణోత్సవ వనభోజనాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 25
సమయం : ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
వేదిక : కిట్టి హోలో పార్క్ (Kitty Hollow Park), పెవిలియన్ E & F, 9555 HWY. 6 S, మిస్సౌరీ సిటీ, TX 77459
ప్రత్యేక ఆకర్షణలివీ :
10 ఏళ్ల లోపు వారికి ప్రవేశం ఉచితం
అందరికీ స్నాక్స్
మధ్యాహ్నం రుచికరమైన భోజనం








