TANA-Paatasala: తానా – పాఠశాల మన తెలుగు మన పిల్లలకోసం..

మాతృభాష తెలుగు మన ఆస్తి, అస్తిత్వం.. భాషే బంధానికి మూలం.. అమెరికాలో మన ప్రవాస తెలుగింటి చిన్నారులకు సరళంగా, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకునే విధానంలో తెలుగు భాషను ఎన్నో ఏళ్లుగా నేర్పిస్తున్న తానా (TANA) విభాగం పాఠశాల.. రాబోయే విద్యా సంవత్సరానికి (2025 – 2026) అడ్మిషన్స్ జరుగుతున్నాయి.
తెలుగు, భాష మాత్రమే కాదు.. శతాబ్దాల మన చరిత్ర, జీవం, జీవనం..మన ముందు, మన తర్వాత తరాల వారికి అనుబంధంగా,అనుసంధానంగా, సాంస్కృతిక వారధిగా నిలిచే మన మాతృభాషను కాపాడుకుందాం.. మన చిన్నారులను పాఠశాలలో చేర్పించి ఈతరం మన సమిష్టి భాద్యతను చిత్తశుద్ధితో నిర్వహిద్దాం..