ఆరోగ్యవంతమైన అమ్మాయి – ఆరోగ్యవంతమైన అమ్మ

మహిళా దినోత్సవము సందర్భంగా 9 to 18 సంవత్సరాలు వయసున్న గ్రామీణ ఆడపిల్లల కోసం #TANAFoundation ప్రారంభించిన Pilot ప్రాజెక్ట్.
Healthy Girl – Healthy Future.
ఆరోగ్యవంతమైన అమ్మాయి – ఆరోగ్యవంతమైన అమ్మ
నేటి తరం ఆడపిల్లలే రేపటి తరం భవిష్యత్తు ప్రదాతలు. కానీ నేడు ఉన్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లల ఆరోగ్యమే ప్రశ్నగా మారుతోంది.
తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాల వారే. వారికి కానీ, వారి తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లల ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఆడపిల్లలకు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకునే పరిస్థితులు లేకపోవటం వల్ల నేడు ఉండే చిన్న చిన్న లోపాలను గుర్తించి సరిచేసుకొకపోవటం వల్ల వారు భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు.
వారికి ఆరోగ్య సమస్య ల పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడపిల్లలను తద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కి శ్రీకారం చుట్టగలుగుతాము.