TANA: తానా 24వ మహాసభలు… క్రికెట్ టోర్నమెంట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డిట్రాయిట్‌లో వైభవంగా నిర్వహించనున్న తానా 24వ మహాసభలను పురస్కరించుకుని మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసింది. మే 24,25,26 తేదీల్లో మిచిగన్ లోని వెస్ట్ బ్లూమ్ ఫీల్డ్ టౌన్ షిప్‌లోని డ్రేక్స్ స్పోర్ట్స్ పార్క్ లో ఈ పోటీలు జరగనుంది. ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి జాతీయ ఛాంపియన్స్ ట్రోపీతోపాటు ప్రైజ్ మనీని కూడా బహుకరించనున్నారు. నార్త్ అమెరికాలోనే అతిపెద్ద టి-బాల్ లీగ్ అయిన డెట్రాయిట్ క్రికెట్ లీగ్‌తో కలిసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడే మీ టీమ్ ను ఎంపిక చేసుకోండి. పరిమితమైన టీమ్‌లతో ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నందున వెంటనే రిజిష్టర్ చేసుకోవాలని ఇతర వివరాలకు వంశీ కృష్ణ (201)993-8595, శివ రాజేష్ మొక్కపాటి (201)450-8022ని సంప్రదించవచ్చు. ఈ లింక్ ద్వారా కూడా మీ టీమ్ ను నమోదు చేసుకోవచ్చు.
https://tanaconference.org/sports-registration