టాకో తెలుగు సాహితీ బృందం వారి సమర్పించు – అచ్చ తెలుగు సాహితీ సాయంత్రము

వక్త: బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, “కుదురాటగండ”, “ఏకైక అచ్చతెలుగు అవధాని”.
స్థలము: సాయి బాబా మందిరము, 2596 లూవిస్ సెంటెర్ రోడ్డు, లూవిస్ సెంటెర్, కొలంబస్, ఒహహో, 43035.
తేది: 7/31/2022.
సమయం: సాయంత్రము 4:30 నుండి 7:30 వరకు.
కవి పరిచయం: బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అచ్చ తెలుగు అవధాని. వీరి తండ్రి పాలపర్తి వేంకట సుబ్బారావు, ఉద్దండ సంస్కృత పండితులు మరియు వీరి మాతామహులు పేరెన్నెక గన్న చల్లా పిచ్చయ్యశాస్త్రి. వీరి గురువులు “కవిసమ్రాట్” డా. విశ్వనాథ సత్యనారాయణ గారు, బ్రహ్మశ్రీ జోస్యుల సూర్యనారాయణమూర్తి గారు మరియు అవధాన గురువులు శతావధానులు డా.సూరం శ్రీనివాసులు గారు. శ్యామలానంద ప్రసాద్ గారు ‘త్రిగళావధానం’ అనే నూతన అవధాన ప్రక్రియ కనిపెట్టి ‘త్రిగళావధాన స్రష్ట’ అని వైశిష్ట్యమైన బిరుదునూ పొందారు. వీరు ఇప్పటివరకు సుమారు 500 అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసారు.
అధ్యక్షులు: మన అదృష్టం, శ్రీ మాన్యులు ఎన్.సిహెచ్ చక్రవర్తి గారు, “నవరస కవి” అమెరికా ప్రయాణంలో ఉండి, మన సభకి అధ్యక్షత వహిస్తున్నారు. వీరు తెలుగు భాషాభివృద్ధికి యనలేని సేవ చేస్తున్నారు. వీరి తండ్రి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, “గాన కళాప్రపూర్ణ” బిరుదాంకితులు మరియు త్యాగరాజ శిష్య పరంపరలో ఐదవ వారు. శ్రీ చక్రవర్తి గారు అనేకనేక తెలుగు సాహిత్య ప్రక్రియలలో సిద్ధహస్తులు.
అచ్చ తెలుగు పద విన్యాసములతో తెలుగు గుండెల సేద తీర్చాలనే ఆలోచనతో, ఈ సమావేసాన్ని “టాకో తెలుగు సాహితీ బృదం” యేర్పాటు చేస్తుంది. తెలుగు భాషాభిమానులకు, పద్య ప్రియులకు, అవధాన ప్రియులకు, తెలుగు వారందరికీ ఇదే మా ఆహ్వానము. తెలుగు మకరందపు తీపిని అందరూ ఆస్వాదించాలి అనే కోర్కెతో…
— మీ టాకో తెలుగు సాహితీ బృందం