అధిక బరువు తగ్గటానికి ఆరోగ్యమైన, శాస్త్రీయమైన పద్ధతులపై లాటా సదస్సు

అమెరికా లో ఉంటున్న మనకు మాత్రమే కాకుండా, భారతదేశం లో ఉన్న మన తల్లితండ్రులకి, బంధు మిత్రులకి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడాలి అని వాఖ్యానం మొత్తం తెలుగు లో చెయ్యటం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అధిక బరువు తో కానీ, బీపి తో కానీ, షుగర్ తో కానీ బాధపడుతుంటే, వారికి కూడా తప్పక చెప్పండి.
US time: Sept 12th Saturday 7:30 PM PDT
India time: Sept 13th Sunday 8 AM IST
అధిక బరువు బీపీ, షుగరు వంటి ఎన్నో సమస్యలకి కారణం అవ్వుతుంది. బరువు తగ్గటానికి చాలా మార్గాలు వున్నాయి. మరి అవి ఎందుకు పని చెయ్యటం లేదు? ఒక వేళా బరువు తగ్గినా మళ్ళీ వెంటనే ఎందుకు పెరిగిపోతున్నాము? శాశ్వత పరిష్కారం ఏమిటి? డైట్ అంటే ఆకులు అలములు తినటమా?
ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు Dr. Anitha Reddy, Dr. Sirisha Potluri LATA Facebook Live September 12, 7:30 PM సదస్సులో వివరంగా చెప్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే లైవ్ షో లో అడగవచ్చు.