కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళం : ఫైజర్

కరోనాతో పోరాడుతున్న భారత్‍కు అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ భారత్‍కు భారీ సాయం ప్రకటించింది. కొవిడ్ చికిత్సలో వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు వెల్లడించింది. దాదాపు రూ.510 కోట్లు విలువ చేసే ఈ ఔషధాలను అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ కేంద్రాల నుంచి భారత్‍కు అందించనున్నట్లు కంపెనీ సీఈవో ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు. భారత్‍లో కరోనా పరిస్థితులు మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత్‍కు వీలైనంత త్వరగా తమ సాయం అందే దిశ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇదే అదిపెద్ద విరాళమని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం కరోనా చికిత్స కోసం అనుమతించిన మందులను ఫైజర్ భారత్‍కు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోరాటంలో భారత్‍తో కలిసి సాగుతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కొవిడ్-19 బాధితులందరికీ ఈ ఔషధాలు ఉచితంగా అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతోనే ఈ సాయాన్ని అందజేస్తున్నాం అని తెలిపారు. వీటని అవసరమైన చోటుకు వీలైనంత త్వరగా చేర్చేందుకు భారత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.