కరోనా వ్యాక్సిన్లో భారత్ మరో ముందడుగు
భారత్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్లో మరో ముందడుగు పడింది. ఒక్రటెండు రోజుల్లో టీకా మూడో దశ ప్రయోగాలు ప్రారంభం కానున్నట్లు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. అయితే ఆయన అది ఏ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సినో వెల్లడించలేదు. మిగిలిన రెండు టీకాల ప్రయోగాలు రెండు, మూడు దశల్లో ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ కూడా స్వాతంత్య్ర దినోత్స ప్రసంగంలో త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. వీకే పాల్ ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ భారత్ బయోటెక్, క్యాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్, జెన్నోవా, బయోలాజికల్-ఇ ప్రతినిధులతో సమీక్ష చేపట్టింది.






