ఏపీలో 6 లక్షలు దాటిన కేసులు
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధప్రదేశ్ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఏరోజుకారోజు టెస్టుల్లో దూకుడు ప్రదర్శిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ 24 గంటల్లో 77,492 టెస్టుల చేసి మరో రికార్డు సొంతం చేసుకుంది. దీంతో పాటు కోలుకున్న వారి సంఖ్య కూడా 5 లక్షలు దాటింది. రికవరీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,702 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,712 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ కారణంగా 72 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 48,84,371 టెస్టులు చేయగా, 6,01,462 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,08,088 మంది కోలుకోగా, 88,197 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 5,177కు చేరింది. రికవరీ రేటు 84.48 శాతానికి పెరిగింది. దేశంలోనే అత్యధికంగా ఏపీలో మిలియన్ జనాభాకు 91,468 టెస్టులు చేస్తున్నారు. గత ఐదు రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.






