వారికి గుండె లయ తప్పొచ్చు!
తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగుల్లో గుండె లయ తప్పే అవకాశం ఉందని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తేలికపాటి, మోస్తరు కొవిడ్ లక్షణాలు కలిగిన రోగులతో పోల్చితే తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడిన వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ గుండెలోని కణాలకు వ్యాపించడమే ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని తెలిపారు. హృదయ స్పందనలను సమన్వయపరిచే విద్యుత్ ప్రేరణలు (ఎలక్ట్రికల్ ఇంపల్స్) సక్రమంగా పనిచేయకపోవడంతో గుండె కొట్టుకునే రేటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు.






