ఏపీలో 8,846 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 70,511 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 8,846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 9,628 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 69 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 47,31,866 టెస్టులు చేయగా, 5,83,925 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 4,86,531 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, 92,353 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 5,041కి చేరింది. మగళవారం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,423 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మిలియన్ జనాభాకు అత్యధికంగా 88,612 టెస్టులు చేస్తున్నారు.






