అమెరికా మార్కెట్ లోకి అసెటజోలమైడ్!
ఔషధ కంపెనీ జైడుస్ కాడిలా తాను తయారు చేసిన జనరిక్ అసెటజోలమైడ్ ఇంజెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి తుది ఆమోదం లభించిందని తెలిపింది. సింగిల్ డోస్‌లో 500 ఎంజీ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉద్దేశించిన అసెటజోలమైడ్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి యునైటెడ్ స్టేట్స్ పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డీఏ) నుంచి తుది అనుమతి లభించిందని జైడుస్ కాడిలా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)కి సమర్పించిన పత్రంలో పేర్కొంది. ఈ ఔషధం అమ్మదాబాద్‌లోని మొరాయియా వద్ద గల జైడుస్ కాడిలా గ్రూప్ ఫార్ములేషన్స్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రంలో తయారవుతుంది. ఇది డయమోక్స్కు జనరిక్ వెర్షన్ అని జైడుస్ కాడిలా తెలిపింది.













