ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత
తనకు రాజీనామా చేసే ఆలోచన లేదని ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. పెట్టుబడిదారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ పదవి నుంచి దిగిపోవడానికి ఆయన అంగీకరించడం లేదు. డేటా లీకేజీ సహా తదితర కారణాల వల్ల బోర్డు చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని జుకర్‌బర్గ్‌ను కొందరు ఇన్వెస్టర్లు డిమాండ్ చేశారు. అయితే జుకర్‌బర్గ్ సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజీనామా చేయబోనని సృష్టం చేశారు. తాను పదవి నుంచి దిగిపోవడానికి ఇది సరైన సమయం కాదని వెల్లడించారు.













