ఫేస్ బుక్ లో సమస్యలు : జుకెర్ బర్గ్
ఫేస్బుక్లో సమస్యలను సరిచేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మార్క్ జుకెర్బర్గ్ అన్నారు. ఫేస్బుక్ లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలైటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. పలు కోర్టులో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వోక్స్ అనే మీడియా సంస్థతో జుకర్బర్గ్ మాట్లాడారు. ఈ లోపాలను పరిహరించగలం. కానీ కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సమస్యలను మూడు లేదా ఆరు నెలల్లోపే సరి చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ, వాస్తవం ఏమిటంటే ఇంత కంటే ఎక్కువ సమయమే పడుతుంది అని అన్నారు.













