అట్లాంటాలో వైఎస్సార్ జయంతి…ఉండవల్లి ముఖ్య అతిధి
అట్లాంటాలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బిరియానీ పాట్ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా వైఎస్ఆర్ చిరకాల మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు వందమందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తన అనుభవాలను కొన్నింటిని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎన్నారైలతో పంచుకున్నారు. వంద రోజుల పాటు తాను రాజకీయాలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నందున, వాటి గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వారితో తన అనుబంధాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడతానంటూ ప్రసంగాన్ని ప్రారంభిచారు. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం ఒక పార్టీ అధినేతకు, కార్యకర్తకు ఉన్న సంబంధం మాత్రమేనని అయితే ఆయనకు నాలో కొన్ని అంశాలు నచ్చటం వలన తనను అభిమానించి ఎంపీని చేశారన్నారు.
చివరగా అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఒకమాట చెప్పమని అడిగారు. దీనికి ఉండవల్లి స్పందిస్తూ జగన్ కేవలం మంచి పరిపాలన అందిస్తే సరిపోదు. తన తండ్రి ఇచ్చినటువంటి అద్భుతమైన పాలనను మరిపించగలిగేలా, గొప్పగా పాలన అందించాలి. అది అతని ముందున్న సవాలు. ప్రస్తుత ప్రభుత్వం వేసే అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. తన ప్రయత్నంలో సఫలీకతుడవుతాడనే భావిస్తున్నానని చెప్పారు.
విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమాలు మాతదేశ అభివద్ధికి తోడ్పాటునందిస్తూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కషిచేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అట్లాంటా వైఎస్ఆర్సీపీ విభాగాన్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రత్యేకంగా అభినందించారు.













