అమెరికాలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
అమెరికాలోని అట్లాంటా నగరంలో ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘననివాళులర్పించారు. బాంబేలాంజ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సుమారు 200 మంది వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ తొలి డైరెక్టర్ కృష్ణారెడ్డి వైఎస్ఆర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఏపీఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ పండుగాయాల రత్నాకర్, ఏపీ విదేశీ విద్య సలహాదారు డాక్టర్ కుమార్ అన్నవరపు, వైఎస్ఆర్సీపీ ముఖ్యులు చింత వెంకటరామిరెడ్డి, కొట్లూరి శ్రీనివాసు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













