మెంఫిస్ లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని అమెరికాలో వివిధ నగరాల్లో జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. మెంఫిస్‌లోని హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యర్రబోతుల శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకట్ తమ్మ, వీరమోహన్ రెడ్డి, సూర్య, రమేష్, రామ్, విజయ్, జయ్‌పాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రామకష్ణ, తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యులు కిరణ్ పారపూడి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.













