వాషింగ్టన్ డీసీ లో వైఎస్సార్ వర్ధంతి
వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ కో-ఆర్డినేటర్ వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎనిమిదో వర్ధంతిని ఆయన అభిమానులు, కార్యకర్తలు వర్జీనియాలోని బంజారా ఇండియన్ కుసైన్ లో సమావేశమై జరిపారు. ఆ మహనీయుడికి ఘన నివాళుర్పించారు వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ కో-ఆర్డినేటర్ వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఏపీ నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
ముఖ్యఅతిథులు వేణు జంగా, అమర్ కటిక రెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, క్రిష్ణారెడ్డి చాగంటి, ప్రసన్న కాకుమానిని సత్కరించారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కరిగిపోయే కాలం వెంట చెరిగిపోని నీ చిరునవ్వు సాక్షిగా రాజన్న సువర్ణ రాజ్యాన్ని సాధించుకోవడమే మా తెలుగు ప్రజలు నీకిచ్చే నిజమైన నివాళి’ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని, వైఎస్ఆర్ సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలు చూశారు గనుకే ఇకపైన కూడా అలాంటి నేతలే రావాలని, కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమౌతుందన్నారు. వైఎస్ఆర్ సీపీ అమెరికా కో-కన్వినర్ రత్నాకర్ పండుగాయల మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వైఎస్ఆర్ వెళుతూ వెళుతూ ఆయన నిలువెత్తు రూపం లాంటి జగనన్నని మనకు ఇచ్చి వెళ్లారని చెప్పారు. జగనన్నని ముఖ్యమంత్రిని చేసేవరకు వైఎస్ఆర్ అమెరికా కమిటీ విభాగం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
పెద్ద సంఖ్యలో హాజరైన సభికుల నుండి పలువురు వక్తలు వైఎస్ఆర్తో తమ సాన్నిహిత్యం, తెలుగు రాష్ట్రాలకు వైఎస్ఆర్ అందించిన సంక్షేమ పథకాలు తెలుపుతూ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. వందలాది మంది ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సత్తిరాజు సోమేశ్వర రావు, సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, శ్రీధర్ నాగిరెడ్డి, మధుసూధన రెడ్డి పోళ్లుచల్లా, తదితరులు ఆంధ్ర జగతి సిగలో వైఎస్ఆర్ సీపీ పతాకాన్ని చిరస్థాయిగా నిలపడమే వైఎస్ఆర్ కు నిజమైన నివాళి అన్నారు.













