అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాతో జగన్ సతీమణి భేటీ
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్‌గా ఉన్న కేథరిన్ హడ్డాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి, ఆయన కుమార్తెలు హర్షిణి, వర్షలను కలుసుకున్నారు. అమెరికా కాన్సులేట్‌లో హడ్డా వీరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయం సాధించడంపై ఆయన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. హర్షిణి, వర్ష త్వరలోనే చదువుల కోసం అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో వీరి ప్రయాణం సాఫిగా సాగాలని కేథరిన్ హడ్డా ఆకాంక్షించారు. భారతి, హర్షిణి, వర్షలతో భేటీ అయిన విషయాన్ని హడ్డా ట్విట్టర్లో పంచుకున్నారు.













