తానా యూత్ కార్యక్రమాలు
తానా మహాసభల్లో యూత్ కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జూలై 7వ తేదీన యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. యూత్‌ను ఉల్లాసపరిచేందుకు కాప్రికో టీమ్‌తో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. హీరోయిన్ శ్రీలీల, హీరో నిఖిల్ సిద్దార్థ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జూలై 8వ తేదీన సెలబ్రిటీతో క్వశ్చన్ అండ్ ఆన్సర్, తెలుగు టాంగో పేరుతో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డిజె రాకేశ్ పాల్గొంటున్నారు. జూలై 9వ తేదీన సఫ్రాన్ సన్‌రైజ్ పేరుతో ఓ కార్యక్రమం, కెరీర్ ఫెయిర్, కాఫీ ఛాట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమం జరుగుతుంది.













